సోషల్ మీడియా నుంచి ఆ పోస్టులు తొలగించండి !

Telugu Lo Computer
0


బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అనంతరం చోటు చేసుకుంటుున్న పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ముఖ్యంగా నుపుర్ శర్మ వ్యాఖ్యల అనంతరం చోటు చేసుకున్న ఉదయ్ పూర్ దర్జీ హత్యను సైతం ప్రస్తావించింది.ఇందుకు నుపుర్ వ్యాఖ్యలే కారణమని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ చర్యలకు దిగింది. ఉదయ్ పూర్ లో దర్జీ హత్య తర్వాత దాన్ని సమర్ధిస్తూ సోషల్ మీడియాలో కొందరు పెడుతున్నపోస్టుల వల్ల దేశంలో మత సామరస్యం దెబ్బతింటోందని భావిస్తున్న కేంద్రం.. వాటిని కట్టడి చేసేందుకు రంగంలోకి దిగింది. ఇలాంటి పోస్టుల్ని తొలగించాలని సోషల్ మీడియా సంస్ధలకు ఆదేశాలు ఇచ్చింది. నుపుర్ శర్మ ఫోటోను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నారనే కారణంతో దర్జీని ఇద్దరు నిందితులు హత్య చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో వివాదం చెలరేగింది. ఇది కాస్తా రోజురోజుకూ పెద్దదవుతోంది. ఇప్పటికే దీనిపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉదయపూర్‌లో ఇటీవల జరిగిన హత్యను ప్రోత్సహించే, మహిమపరిచే లేదా సమర్థించే కంటెంట్‌ను పూర్తిగా తొలగించాలని అన్ని సోషల్ మీడియా కంపెనీలను ఆదేశించింది. ప్రజా శాంతి , సామరస్యాన్ని పునరుద్ధరించడానికి ఇది అవసరమని తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు పంపిన ఆదేశాల్లో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన హత్య వీడియోలే కాకుండా, సోషల్ మీడియా హ్యాండిల్‌లు హత్యను కీర్తించడం లేదా సమర్థించడం వంటి అనేక ఘటనలు తన దృష్టికి వచ్చాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. సోషల్ మీడియా కంపెనీలు తమ మధ్యవర్తులుగా ఉండే బాధ్యతలో భాగంగా అటువంటి కంటెంట్‌ను తీసివేయాలని పేర్కొంది. ఈ నోటీసు ద్వారా, తగిన శ్రద్ధ, భద్రత , విశ్వాసం కల్పించే మీ బాధ్యతలో భాగంగా ఏదైనా లేదా మొత్తం కంటెంట్‌ను (టెక్స్ట్ మెసేజ్, ఆడియో, వీడియో, ఫోటో లేదా రూపంలో అయినా) ముందుగానే, తక్షణమే తీసివేసినట్లు నిర్ధారించుకోవాలని కేంద్రం సోషల్ మీడియా సంస్ధల్ని కోరింది. ఈ హత్యలను ప్రోత్సహించడం/గౌరవం చేయడం/జస్టిఫై చేయడం వంటివి శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా నిరోధించడానికి, ప్రజా శాంతి సామరస్యాన్ని పునరుద్ధరించడానికి తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా కంపెనీలకు తన నోటీసులో పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)