తల్లి ప్రేమ ఎనలేనిది !

Telugu Lo Computer
0


తల్లి, తన బిడ్డను పెంచుతున్నప్పుడు భవిష్యత్తులో రాగల సవాళ్లను ఎదుర్కొనేందుకు బాల్యం నుంచే సిద్ధం చేస్తుంది. మనిషి అయినా లేదా జంతువు అయినా తన పిల్లలపై ప్రేమ ఎప్పుడూ తగ్గదు. బిడ్డ కూడా తన తల్లిని ఎక్కువగా ప్రేమిస్తుంది. చిన్న సింహం.  తన తల్లి నిద్రపోతుండగా అక్కడికి వెళ్లి తనను లాలించమంటూ మారం చేస్తుంది. సింహం కూడా తన ప్రేమను చూపుతూ పిల్లను కౌగిలించుకుంటుంది. వైరల్ అవుతున్న వీడియోలో సింహం నిద్రపోతుండటాన్ని మీరు చూడవచ్చు.. అదే సమయంలో పిల్ల సింహం నెమ్మదిగా తన తల్లి వద్దకు వచ్చి ప్రేమతో కౌగిలించుకుంటుంది. అది కూడా వెంటనే లేచి బుల్లి సింహాన్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని కౌగలించుకొని.. ముద్దాడుతుంది. తనను ఆడించాలంటూ సింబా  సింహాన్ని పట్టుబడుతుంది. దీంతో సింహం కూడా నిద్ర నుంచి మేల్కొని సింబాను సంతోషంలో ముంచెత్తుతుంది. ఈ వైరల్ అవుతున్న వీడియో అందరి హృదయాలను గెలుచుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)