ఎనిమిది మంది మోడల్స్‌పై గ్యాంగ్‌ రేప్‌ !

Telugu Lo Computer
0


దక్షిణాఫ్రికా లోని  జోహెన్నెస్‌బర్గ్‌ పశ్చిమంగా ఉన్న క్రూగర్స్‌డ్రాప్‌ గ్రామంలో అక్రమ చొరబాటుదారులు మ్యూజిక్‌ వీడియో షూట్‌లోకి ఆయుధాలతో చొరబడి మోడల్స్‌పై గ్యాంగ్‌ రేప్‌నకు పాల్పడ్డారు. నిందితులను జామా జామాలుగా గుర్తించిన జోహెన్నెస్‌బర్గ్‌ పోలీసులు అక్రమ మైనింగ్‌ కోసం పొరుగు ప్రాంతాల నుంచి అక్రమంగా చొరబడతారని, తరచూ దోపిడీలకు పాల్పడతారని వెల్లడించారు. వాళ్లు దాడి చేసింది దోపిడీ కోణంలోనే అయినా మోడల్స్‌ కనిపించేసరికి అత్యాచారానికి తెగబడ్డారని, ఇలా జరగడం ఇదే మొదటి ఘటన అని పోలీసులు తెలిపారు. బాధితులంతా 35 ఏళ్ల లోపువాళ్లేనని తెలుస్తోంది. ఆపై మగవాళ్లతో నగ్న నృత్యాలు చేయించి వాళ్ల దగ్గర ఉన్న సొమ్ము, నగలను దోచుకెళ్లారు. గుంపుగా దుండగులు దాడి చేసినట్లు బాధితులు వెల్లడించగా 67 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీళ్లలో చాలామంది అక్రమ చొరబాటులేనని నిర్ధారించారు. ఇక ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా స్పందించారు. అలాంటి మృగాలకు బతికే హక్కు లేదని, కఠిన శిక్ష విధించి తీరతామని తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)