సైనికుడి ప్రాణం నిలిపిన ఐఫోన్‌ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 18 July 2022

సైనికుడి ప్రాణం నిలిపిన ఐఫోన్‌ !


ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా రష్యా బలగాలు తూటాల వర్షం కురిపించగా.. ఓ ఉక్రెయిన్ సైనికుడు తన మిలిటరీ బ్యాగులో ఉన్న ఐఫోన్‌ కారణంగా ప్రాణాలు నిలుపుకోగలిగాడు. ఈ వార్త నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఓ బుల్లెట్ అతనివైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో సైనికుడి బ్యాగులో ఉన్న 2019 మోడల్‌ ఐఫోన్‌ 11ప్రోకు బుల్లెట్ తగిలి అది ధ్వంసం అయ్యింది. అదే బుల్లెట్ నేరుగా ఆ సైనికుడికి తగిలి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది అన్నది నెటిజన్లు చెబుతున్న మాట. ఈ ఘటనపై వారు పెడుతున్న కామెంట్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. "స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించిన మెటీరియల్‌తో బుల్లెట్‌ ప్రూఫ్ జాకెట్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? ఇది చాలా ఈజీనే కదా! " అని ఒకరు కామెంట్ పెట్టారు. "ఐఫోన్‌ చివరకు ఏదో ఒక పనికి ఉపయోగపడింది!” అని మరొకరు పేర్కొన్నారు. 

No comments:

Post a Comment