పెరిపోతున్న మధుమేహ బాధితులు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 7 June 2022

పెరిపోతున్న మధుమేహ బాధితులు


పెద్దవాళ్లలో అత్యధిక మధుమేహులు ఉన్న రెండో దేశంగా భారత్ నిలిచింది. మూడు దశాబ్దాలుగా దాదాపు 150 శాతం మధుమేహులు పెరిగారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) తెలిపింది. కోవిడ్ ప్రభావం మధుమేహులపై ఎక్కువగా ఉన్నట్లు కూడా ఐసీఎమ్ఆర్ చెబుతోంది. ఇతర అనారోగ్యాలకు మధుమేహం కారణమవుతోంది. ఈ నేపథ్యంలో మధుమేహులకు అందించే చికిత్స విషయంపై ఐసీఎమ్ఆర్ కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. చిన్న వయసు వారు కూడా టైప్-2 డయాబెటిస్ బారిన పడుతుంటడంపై సీఎమ్ఆర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 25-34 ఏళ్ల మధ్య వయసు వాళ్లు కూడా మధుమేహానికి గురవుతున్నారు. టైప్-1 డయాబెటిస్ ఇన్సులిన్ లోపం వల్ల, హైపర్ గ్లైసీమియా వల్ల వస్తుంది. దీనికి జన్యుపరమైన అంశాలు కారణం కావొచ్చు. తల్లిదండ్రులు, తోబుట్టువులకు వచ్చి ఉంటే టైప్-1 డయాబెటిస్ రావొచ్చు. పాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం ఆగినప్పుడు లేదా తక్కువ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టినప్పుడు పిల్లల్లో కూడా ఈ మధుమేహం రావొచ్చు. ఇన్సులిన్ లేకుండా చక్కెరను కణాలు గ్రహించి, రక్తానికి అందించలేవు. ప్రపంచవ్యాప్తంగా 11 లక్షల మంది ఇరవై ఏళ్ల వయసులోపు వాళ్లు టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ప్రధానంగా లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. డైట్, ఫిజికల్ యాక్టివిటీ మధుమేహం రాకుండా ఉంచడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, బరువు, లిపిడ్ లెవల్స్ సరైన మోతాదులో ఉండేలా చూసుకోవడం, పోషకాహారం, వ్యాయామం వంటివి మధుమేహాన్ని నియంత్రిస్తాయి. ముఖ్యంగా పిల్లలకు సరైన పోషకాహారం అందించాలి. టైప్-1 డయాబెటిస్‌ను గుర్తించాక ఇన్సులిన్ తీసుకోవడం ప్రారంభించాలి. దీన్ని జీవితాంతం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ వైద్యులను సంప్రదించాలి. ఫిజిషియన్, డయాబెటిస్ స్పెషలిస్ట్, న్యూట్రిషనిస్ట్‌ను నిత్యం సంప్రదించాలి. ఇన్సులిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా గుర్తించి, వాటికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. రెగ్యులర్‌గా రక్తంలో చక్కెర లెవల్స్‌ను పరీక్షించుకోవాలి.

No comments:

Post a Comment