మోదీ, షాలపై బీజేపీలో తీవ్ర అసమ్మతి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 7 June 2022

మోదీ, షాలపై బీజేపీలో తీవ్ర అసమ్మతి


మహ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యల సమస్యపై మోదీ, షా ద్వయం వ్యవహరించిన తీరు పట్ల పార్టీలో చాలామంది పార్లమెంటు సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు గుజరాతీ నాయకుల దుందుడుకు నిర్ణయాలు, అనాలోచిత చర్యల వల్ల అంతర్జాతీయంగా భారతదేశం నవ్వులపాలుకావడం.. ఇన్నేండ్లుగా మంచి మిత్రులుగా ఉన్న దేశాల్లో కూడా అభాసుపాలు కావడం ఈ ఇద్దరు నాయకుల స్వయంకృతమేనని అంటున్నారు. ఈ రకమైన పోకడ దేశానికి ఎంతమాత్రం మంచిది కాదని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతున్నట్టు మోదీ వ్యతిరేక శిబిరంలోని ఒక నాయకుడు తెలిపారు. బీజేపీ నేతలు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌లను పార్టీ నుంచి తొలగించడం ద్వారా బలి పశువులను చేశారని ఢిల్లీలో కొందరు బీజేపీ నేతలు ఆరోపించారు. తాము కొన్నేండ్లుగా బీజేపీ సైద్ధాంతిక విధానాన్ని ఒక భావోద్వేగంతో అనుసరిస్తున్నామని, ఇప్పుడు పార్టీ లైన్‌ కాదు అని మాట్లాడటం సమంజసమేనా? అని ఢిల్లీ బీజేపీ నేత ఒకరు అన్నారు. నూపుర్‌, జిందాల్‌ మాట్లాడింది పార్టీ లైన్‌ కాకపోయి ఉంటే వారిని ముందే హెచ్చరించి ఉండాల్సింది కదా! అని వారు బహిరంగంగానే అంటున్నారు. దేశంలో మత చిచ్చు రగిల్చి, అశాంతిని రేపి దేశమంతా పలువురు నాయకులు మతోన్మాదంతో విద్వేష ప్రసంగాలు చేస్తుంటే మోదీ, షా మౌనంగా చూస్తూ ఉండిపోవడం దారుణమని వాపోయారు. తీరా అంతర్జాతీయంగా దేశం పరువు పోయాక జిందాల్‌, నూపుర్‌ను తొలగించడం అంటే నిజానికి వారిని బలిచేయడమేనని అంటున్నారు. వాళ్ల అవసరాల కోసం వాడుకొని, ఇప్పుడు పార్టీ నుంచి తొలగించడం సరైంది కాదని విమర్శిస్తున్నారు. వీరిద్దరి వైఖరి వల్లనే దేశవ్యాప్తంగా పలువురు పార్టీ నేతలు చిత్తం వచ్చినట్టు రెచ్చిపోతున్నారని, ఇది పార్టీకి, దేశానికి ప్రమాదఘంటికలు మోగిస్తుందని పార్టీలోని మోదీ అసమ్మతి వర్గం ఆందోళన వ్యక్తంచేస్తున్నది. ఈ క్రమంలోనే కొందరు పార్లమెంటు నేతలు మోదీ, షా తీరుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ ప్రారంభించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వందమందికి పైగా ఎంపీలు సంతకాలు చేసినట్లు తెలిసింది. మరోవైపు ఖతర్‌ పర్యటనకు వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని అక్కడి అమీర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ అహ్మద్‌ కలవడానికి ఇష్టపడకపోవడం, ఇద్దరి మధ్య విందు సమావేశం రద్దు కావడం భారత్‌కు తీరని అవమానంగా భావిస్తున్నారు. మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలే ఈ సమావేశం రద్దుకు కారణమని తెలుస్తున్నది. వైద్య సంబంధ సమస్యల కారణంగా విందు 10వ పేజీలో సమావేశం రద్దయినట్టు ఖతార్‌ అధికారవర్గాలు భారతకు సమాచారం అందించినట్టు తెలిసింది. దీంతో ఇద్దరు నేతల సంయుక్త మీడియా సమావేశం కూడా రద్దయింది. పేరుకు వైద్య కారణాలని చెప్తున్నామహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలే ఈ నిర్ణయానికి ఖతర్‌ అధికారులను పురిగొల్పిందని చెప్తున్నారు.

No comments:

Post a Comment