ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సాధారణ బదిలీలకు విధివిధానాలు ఖరారు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సాధారణ బదిలీలకు సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆమేరకు విధించిన బ్యాన్‌ను ఎత్తేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 8 నుంచి 17వరకు బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది.ఐదేళ్లకు పైబడిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తున్నారు. వ్యక్తిగత వినతులు, పరిపాలన సౌలభ్యం ఆధారంగా బదిలీలను చేపడుతున్నారు. బదిలీల గైడ్ లైన్స్ జారీ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. ఐదేళ్లు ఒకే చోట పని చేస్తే కచ్చితంగా స్థాన చలనం కల్పించాలని స్పష్టం చేసింది. సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ జగన్ సర్కారు సోమవారం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అందుకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం జగన్ సంతకం చేశారు. దీంతో ఉద్యోగుల సాధారణ బదిలీలపై అడ్డుంకులు తొలిగిపోయినట్లు అయింది. జూన్ 17లోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)