పోస్టాఫీస్‌ నేషనల్ సేవింగ్స్ టైం డిపాజిట్ లో బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ !

Telugu Lo Computer
0


పోస్టాఫీస్‌లో నేషనల్ సేవింగ్స్ టైం డిపాజిట్ అకౌంట్లలో  ఫిక్స్‌డ్ డిపాజిట్‌ వడ్డీ రేటు బ్యాంకుల కంటే ఎక్కువ వస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌ మాత్రమే. నిర్ణీత కాలపరిమితితో నిర్ణీతమైన పెట్టుబడులు పొందొచ్చు. ఈ డిపాజిట్ రేటు అనేది మారుతూ ఉంటుంది. 5.5 శాతం నుంచి 6.7 శాతం వరకూ ఉండొచ్చు. ఒక సంవత్సరంలో 5.5 శాతంగా ఉన్న వడ్డీరేటు మూడో సంవత్సరం దాటిన తర్వాతి నుంచి 6.7 శాతం పెరుగుతుంది. కనీసం రూ.1000 నుంచి ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఒకే ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఎఫ్‌డీపై వచ్చే వడ్డీ 40 వేల రూపాయల కంటే తక్కువ ఉంటే, దానిపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పరిమితి 60 ఏళ్లలోపు వారికి మాత్రమే. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల ఎఫ్ డి నుండి 50 వేల రూపాయల వరకు ఆదాయం పొందినా వారు పన్ను చెల్లించాల్సిన అవసర్లేదు. దీని కంటే ఎక్కువ ఆదాయం వస్తుంటే 10% టీడీఎస్ తీసివేస్తారు. ఈ టైమ్ డిపాజిట్ స్కీమ్, ఎఫ్‌డిలో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. దీని కింద, మీరు రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడిపై ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. అదే సమయంలో, పన్ను మినహాయింపు ప్రయోజనం 5 సంవత్సరాల పాటు బ్యాంకుల FDలపై కూడా అందుబాటులో ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)