వృద్ధురాలు పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 18 June 2022

వృద్ధురాలు పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు !


ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఓ వృద్ధురాలు ఒక ప్లాట్‌ఫామ్‌ పైనుంచి మరో ప్లాట్‌ఫామ్‌ పైకి వస్తున్నది. ఈ క్రమంలో పట్టాలు దాటుతున్నది. అయితే ఓ ట్రాక్‌పై నుంచి రైలు వస్తున్నది. దానిని గమనించిన రైల్వే పోలీసు ఆమెను వెనక్కి వెళ్లాలని సూచించాడు. ఇవేమీ పట్టించుకోని ఆమె పట్టాలు దాటుతున్నది. ఇంతలో ఆమె దగ్గరికి రైలు రానేవచ్చింది. వెంటనే ప్లాట్‌ఫామ్‌ చివరికి పరుగెత్తిన ఆ కానిస్టేబుల్‌ ఆమెను పైకి గుంజేశాడు. రెప్పపాటులోనే రైలు వాళ్లను దాటుకుంటూ వెళ్లిపోయింది. అయితే ఆమెకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కెమెరాలో ఇదంతా రికార్డయింది. ఈ వీడియోను రైల్వే అధికారులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. వృద్ధురాలిని కాపాడిన పోలీసును అభినందించారు. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను ఉపయోగించుకోవాలని, పట్టాలు ఎట్టిపరిస్థితుల్లో దాటొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 69 వేల మందికిపైగా దీనిని వీక్షించారు.

No comments:

Post a Comment