సిద్దు హత్య కేసులో షార్ప్ షూటర్‌ హర్‌ కమల్‌ అరెస్ట్

Telugu Lo Computer
0


పంజాబ్‌ సింగర్‌ సిద్దు మూసేవాలా హత్య కేసులో షార్ప్ షూటర్‌ హర్‌కమల్‌ రానును అరెస్టు చేసినట్లు పోలీసులు  తెలిపారు. గత నెల 29న కొంత మంది దుండగులు సిద్దుపై కాల్పులు చేయడంతో చనిపోయాడు. అతనిపై ఎనిమిది మంది కాల్పులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ 8 మంది నిందితుల్లో హర్‌కమల్‌ కూడా ఒకరు. కాల్పులకు పాల్పడ్డ ఎనిమిది మందిలో మొదటగా కమల్‌ను అరెస్టు చేశామని చెప్పారు. అతడిని తామే పోలీసులకు అప్పగించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేశారు. అంతకు ముందు సిద్ధేష్‌ హిరామన్‌ కాంబ్లే అలియాస్‌ మహాకల్‌గా గుర్తించిన గ్యాంగ్‌స్టర్‌, హత్యకు ముందు సిద్దు అభిమానిగా ఫొటో దిగిన వ్యక్తిని అరెస్టు చేశారు. అంతేకాకుండా పలువురు అనుమానితులను అరెస్టు చేశారు. మిగిలిన షూటర్లను సందీప్‌ సింగ్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌, మన్‌ప్రీత్‌ భానులుగా గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)