మే నెలలో రూ.130 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం

Telugu Lo Computer
0


తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం  ఒక మే నెలలోనే శ్రీవారి హుండీ ఆదాయం రూ.130 కోట్లు వచ్చింది. ఒక్క నెలలో ఇంత ఆదాయం రావడం తిరుమల చరిత్రలో ఇదే తొలిసారి. ఈ విషయాన్ని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి చెప్పారు. కరోనా తగ్గిన తరువాత తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తున్నారు. మే నెలలో 22 లక్షల 62 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. మే నెలలో 1.86 కోట్ల లడ్డూలు విక్రయాలు జరిగాయి. గత కొన్ని రోజులుగా శ్రీవారి హుండీ ఆదాయం రోజుకు నాలుగు కోట్లు వస్తోందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. ఇక గత రెండు నెలల్లో ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు 20,62,323 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.127.63 కోట్లు వచ్చింది. ఏప్రిల్‌ 13న అత్యధికంగా 88,748మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అత్యధికంగా రూ.5.11 కోట్లు ఆదాయం చేకూరింది. ఇక మార్చిలో 19,72,656 మంది దర్శించుకుంటే.. ఆదాయం రూ.128.61 కోట్లు వచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)