తుపాకీ హింస నిరోధక బిల్లుకు అమెరికా ఆమోదం

Telugu Lo Computer
0


అమెరికాలో దశాబ్దాలపాటు చర్చలకు మాత్రమే పరిమితమైన 'తుపాకీ హింస నిరోధక బిల్లు'ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ద్విపక్షాల మద్ధతుతో యూఎస్ కాంగ్రెస్ ముందుకొచ్చిన ఈ బిల్లు సెనేట్‌ లో సునాయాసంగా ఆమోదం పొందింది. ఇక హౌస్‌లో పాసయితే ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. ఈ బిల్లు ఎన్నో ఏళ్లుగా చర్చలకే పరిమితమైనా ఇటీవల న్యూయార్క్, టెక్సాస్‌లలో గన్‌కల్చర్ సృష్టించిన రక్తపాతాలు అక్కడి ప్రధాన రాజకీయ పార్టీల్లో చలనం కలిగించాయి. దీంతో నెలక్రితం కూడా ఊహాజనీతంగానే ఉన్న గన్‌కల్చర్ బిల్లు అనూహ్యంగా యూఎస్ కాంగ్రెస్ ముందుకొచ్చింది. ఆయుధాల విక్రయంపై ఆంక్షల విధింపునకు డెమొక్రాట్ల ఇంతకాలం చేస్తున్న ప్రయత్నాలకు రిపబ్లికన్ పార్టీ అడ్డుపడుతూ వచ్చింది. కానీ న్యూయార్క్, టెక్సాస్ కాల్పుల రక్తపాతాలు రిపబ్లికన్ నాయకుల్లోనూ కదలికలు రావడంతో బిల్లు కార్యరూపం దాల్చిందని నిపుణులు చెబుతున్నారు. ఈ విష సంస్కృతిని నిలువరిచేందుకు పటిష్ఠమైన చట్టం అవసరమని ఇరు పార్టీలకు చెందిన సెనేటర్లు భావించారు. ఇందుకు సమన్వయంతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ బిల్లు కార్యరూపం దాల్చితే గన్ కొనుగోలు చేసే యువకుల పూర్వపరాలను తనిఖీ చేస్తారు. అంతేకాకుండా నేరచరిత్ర లేదా మానసిక స్థితి సరిగా లేని వారి నుంచి ఆయుధాలను దూరం చేస్తారు. ప్రమాదకరమైన వ్యక్తుల నుంచి ఆయుధాలను వెనక్కి తీసుకునేందుకు అవసరమైన పకడ్బంధీ చట్టాల రూపకల్పన మార్గాలను రాష్ట్రాలకు సులభతరం చేయనున్నారు. ఈ బిల్లు కింద 13 బిలియన్ డాలర్లు కేటాయించనున్నారు. ఈ నిధులను స్కూళ్ల వద్ద భద్రత పెంపు, మానసిక ఆరోగ్యం, హింస నిరోధక కార్యక్రమాల కోసం కేటాయిస్తారు. కాగా ఎన్నికల ఏడాది డెమొక్రాటిక్ పార్టీ చేసిన వాగ్ధానాలకు ఈ బిల్లు దూరంగా ఉంది. దాడులకు ఉపయోగించే ఆయుధాలపై నిషేధం, అధిక సామర్థ్యమున్న అమ్మోనియం మ్యాగజిన్స్ వినియోగంపై కూడా నిషేధాన్ని అమలు చేయాలని డెమొక్రాటిక్ పార్టీ నేతలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)