ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 25 June 2022

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య


హర్యానాలోని పానిపట్ జిల్లాలోని దహర్ గ్రామానికి చెందిన కర్మవీర్ (50) భార్య జ్యోతి అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ అనే వ్యక్తితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే ప్రియుడితో కులకడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య, ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఫ్లాన్ చేసింది. భర్తకు ఎప్పటిలాగే భోజనం పెట్టిన జ్యోతి, హత్య పథకంలో భాగంగా ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన భర్తను ప్రేమికుడితో కలిసి కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. హత్య అనంతరం మృతదేహాన్ని ఛిద్రం చేయాలనే ఉద్దేశంతో గ్రామంలోని పొలంలో నిర్మించిన ట్యూబ్‌వెల్‌ చాంబర్‌లో దాచిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెల్వనట్లు జ్యోతి ఇంటికెళ్లింది. తన భర్త కనిపించకుండా పోయాడని డ్రామా మెదలుపెట్టింది. మృతుడి సోదరుడు ధరమ్‌వీర్  తన అన్న ఆదివారం నుండి తప్పిపోయాడని, కుటుంబ సభ్యులు కర్మవీర్ కోసం చాలా వెతికారని, కానీ అతడి ఆచూకీ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశామ, ఆ తర్వాత పోలీసులు భార్యను ప్రశ్నించారు. అయితే ఆమె మాటలు పోలీసులకు అనుమానం కలిగించాయి. భార్య జ్యోతిని పోలీసులు విచారించగా అసలు విషయం బయట పడింది. ఆ తర్వాత ప్రేమికుడు శ్రీకాంత్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై హత్యానేరం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారిద్దరినీ రెండు రోజుల పోలీసు రిమాండ్‌కు పంపింది.

No comments:

Post a Comment