చరణ్ ట్వీట్ తో నెటిజన్ల గందరగోళం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 25 June 2022

చరణ్ ట్వీట్ తో నెటిజన్ల గందరగోళం !


ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వారసుడు చరణ్ కూడా సింగర్‌గా రాణించారు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారి తన అభిరుచి మేరకు కొన్ని సినిమాలు తీశారు. అయితే ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు.  చరణ్ విషయానికి వస్తే ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ అంశంతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తండ్రి ప్రశంసలు, అభినందనలతో వార్తల్లో ఉంటే చరణ్ మాత్రం ఎక్కువుగా కాంట్రవర్సీలతోనే కనిపిస్తూ ఉంటారు. తాజాగా చరణ్ 7 / జీ బృందావన కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్నాడంటూ ఓ కొత్త పుకారు బయలు దేరింది. దీనికి చరణ్ చేసిన ట్వీట్టే కారణం. చరణ్ సోనియాతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసి కొత్త ప్రయాణం మొదలు అని ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు అందరూ ఇంకేముందు చరణ్.. సోనియా పెళ్లి చేసుకోబోతున్నారు అని పొరపాటు పడి వారిద్దరికి అభినందనలు చెప్పడం మొదలు పెట్టారు. ఆ తర్వాత చరణ్ ఓ వెబ్‌సీరిస్‌కు సంబంధించి తామిద్దరం కలిసి కొత్త ప్రయాణం చేస్తున్నామంటూ మరో ట్వీట్‌లో చెప్పాడు. దీంతో ఈ పుకార్లకు తెరపడింది. చరణ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ముందుగా స్మితను పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల వైవాహిక జీవితం అనంతరం 2002లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. తర్వాత 2012లో అపర్ణను పెళ్లి చేసుకున్నాడు. సోనియా అగర్వాల్ తక్కువ వయస్సులోనే స్టార్ డమ్ తెచ్చుకుంది. 7 / జీ బృందావన కాలనీ డైరెక్టర్ సెల్వ రాఘవన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. తక్కువ టైంలోనే వీరి మధ్య స్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత సెల్వ రాఘవన్ మరో పెళ్లి చేసుకున్నా, సోనియా మాత్రం ఇంకా పెళ్లికి దూరంగానే ఉంటోంది. 

No comments:

Post a Comment