దేశంలో 14,506 కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 14,506 కొత్త కేసులు నమోదు కాగా, 30 మరణాలు సంభవించాయి. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 99వేల 602కు చేరాయి. రోజువారీ పాజిటివిటి రేటు 3.35 శాతానికి చేరగా, యాక్టివ్ కేసుల సంఖ్య 0.23 శాతంగా ఉంది. ఇప్పటివరకు 4కోట్ల 34లక్షల 33వేల 345కేసులు కాగా 5లక్షల 25వేల 77మరణాలు నమోదయ్యాయి.  రికవరీ రేటు దేశంలో 98.56 శాతంగా ఉండగా, మంగళవారం 11వేల 574 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారు 4కోట్ల 28లక్షల 8వేల 666 మందిగా ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ 530 రోజులకు చేరింది. ఇప్పటివరకు 197.46 కోట్ల డోసుల టీకాలు అందజేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మంగళవారం ఒక్కరోజులో 13లక్షల 44వేల 788 డోసుల టీకాలు అందజేశారు. మొత్తంగా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 197కోట్ల 46లక్షల 57వేల 138 డోసుల టీకాలు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)