నదిలో కుప్పకూలిన పోలీస్ స్టేషన్

Telugu Lo Computer
0


అస్సాంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో ఓ పోలీస్ స్టేషన్ నదిలో కుప్పకూలిపోయింది. బ్రహ్మపుత్ర నదికి వరద నీరు పోటెత్తింది. భారీ వరద కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అయితే నల్బరీ జిల్లాలో నదికి ఆనుకొని పోలీస్ స్టేషన్ భవనం ఉంది. నదిలో భారీ వరద కారణంగా రెండంతస్తుల భవనంలో సగభాగం నీటిలో మునిగిపోయింది. నది ఒడ్డుభాగం భారీకోతకు గురికావడంతో పోలీస్ స్టేషన్ భవనం స్థానికులు చూస్తుండగానే పేకమేడలా కూలిపోయింది. భవనం నదిలో కూలిపోతున్న దృశ్యాలను గ్రామస్తులు ఫోన్ లలో బంధించారు. వాటిని పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ గా మారాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)