సంగం, పెన్నా బ్యారేజీలను తామే పూర్తి చేసి త్వరలోనే ప్రారంభిస్తాం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో పెన్నా, సంగం బ్యారేజ్ పనులను సోమవారం ఉదయం మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని బ్యారేజీలకు వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారని ఆయన మరణం తర్వాత పనులు ఆగిపోయాయని తెలిపారు. 30 శాతం పనులు చేసి టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని త్వరలోనే పెండింగ్ పనులను పూర్తి చేస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. కోవిడ్ వల్ల పనుల్లో జాప్యం జరిగిందన్నారు. నెల్లూరు జిల్లా రైతులకు తలమానికమైన సంగం, పెన్నా బ్యారేజీలను తామే పూర్తి చేసి త్వరలో ప్రారంభిస్తామన్నారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ సీఎం జగన్ చేతుల మీదుగా నెల్లూరు జిల్లాలోని పెన్నా, సంగం బ్యారేజీలను ప్రారంభిస్తామని తెలిపారు. పెన్నా డెల్టా ఆధునికీకరణకు ఈ బ్యారేజ్‌లు ఎంతో కీలకం అని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వరదలు వచ్చినపుడు నెల్లూరు నగరంలోకి వరద నీరు రాకుండా ఈ బ్యారేజ్‌లు ఉపయోగపడతాయన్నారు. జిల్లాలోని ఇరిగేషన్ ప్రొజెక్టులను సమీక్షించి రైతులకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందిస్తామని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)