జూబ్లీహిల్స్ లో ఇంటిని కొనుగోలు చేసిన ఎన్టీఆర్ ?

Telugu Lo Computer
0


జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎన్టీఆర్ కార్ల విషయంలో కానీ లేదా వాచ్ వంటి పలు వస్తువులను ఎంతో ఖరీదు చేసి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో ఎంతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్ తో తీర్చిదిద్దారు. తన డ్రీం హౌస్ కొనుగోలు చేసిన ఎన్టీఆర్ కోసం ఏకంగా 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో ఎంతో లగ్జరీ లైఫ్ గడపడానికి ఇష్టపడతారు. అందుకే ఖరీదైన కార్లు బంగ్లాలను కొనుగోలు చేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ హైదరాబాద్ లో  మాత్రమే కాకుండా బెంగళూరు వంటి నగరాలలో కూడా ఆయనకు ఎంతో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విధంగా ఎన్టీఆర్ పలు చోట్ల పెద్ద ఎత్తున డబ్బులను ఖర్చు చేసి ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కొనుగోలు చేసిన ఈ ఇల్లు హీరో రామ్ చరణ్ ఇంటికి సమీపంలోనే వుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)