జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ

Telugu Lo Computer
0


అంతర్జాతీయ మార్కెట్లో దేశీయ కరెన్సీ విలువ మరింత పతనమైంది. డాలరు మారకంలో రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది. అమెరికా డాలరుతో పోలిస్తే 52 పైసల మేర తగ్గి ప్రస్తుతం 77.42 వద్ద ట్రేడ్ అవుతోంది. శుక్రవారం 55 పైసల మేర పతనమైన రూపాయి విలువ సోమవారం మార్కెట్స్ ఆరంభంలోనే మరింత క్షీణించింది. 77.17 వద్ద ప్రారంభమై 77.42కి పడిపోయింది. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలు, భారత ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, ఆర్బీఐ రెపో రేటును పెంచడం తదితర కారణాలు రూపాయి పతనానికి కారణంగా కనిపిస్తున్నాయి. షాంఘై లాక్‌డౌన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా మార్కెట్లపై గట్టిగానే ప్రభావం చూపాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)