చత్తీస్‌ఘడ్‌లో ఎన్ కౌంటర్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 6 May 2022

చత్తీస్‌ఘడ్‌లో ఎన్ కౌంటర్


చత్తీస్‌ఘడ్‌లోని దంతేవాడ జిల్లాలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఆరన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి నక్సలైట్లు పెద్ద ఎత్తున సమావేశం అయ్యారనే సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) సిబ్బంది నక్సలైట్ల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లకు నక్సలైట్లు తారసపడ్డారు. దీంతో నక్సలైట్లు పోలీసుల పైకి కాల్పులు జరిపి అడవిలోకి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారని.. కాల్పులు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ సిధ్ధార్ధ తివారీ చెప్పారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు డీఆర్జీ జవాన్లు నక్సలైట్లను కదలనీయకుండా చుట్టు ముట్టారు. ఇరు వర్గాల నుంచి అడపా దడపా కాల్పులు జరుగుతున్నాయి. 

No comments:

Post a Comment