దేశంలో 3,545 కొత్త కరోనా కేసులు నమోదు!

Telugu Lo Computer
0


దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 3,545 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనావైరస్ సంఖ్య 4,30,94,938కి చేరుకుంది.  27 కోవిడ్ సంబంధిత మరణాలు కూడా నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,24,002 కు చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, రోజువారీ పాజిటివిటీ రేటు 1.07 శాతంగా ఉండగా, వారంవారీ పాజిటివిటీ రేటు 0.70 శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా నవీకరణ ప్రకారం, శుక్రవారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో భారతదేశంలో 3.545 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాగా క్రియాశీల కేసుల సంఖ్య ప్రస్తుతం 19,688 వద్ద ఉంది. గురువారం నాడు 4.65 లక్ష మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో ఇప్పటివరకు 3549 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. మొత్తం కేసుల రికవరీ 98.74 శాతంగా ఉంది. ఇక క్రియాశీల కేసుల రేటు 0.05% గా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 16.5 లక్షలమందికి వాక్సినేషన్ నిర్వహించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పంపిణీ అయిన మొత్తం వ్యాక్సిన్ రోజుల సంఖ్య 189 కోట్లకు పైగానే ఉంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో ప్రతి రోజు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో తాజాగా 200కు పైగా కొత్త కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తుంది. దాదాపు 40 రోజుల తర్వాత మహారాష్ట్రంలో 200 కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. ఢిల్లీలో తాజాగా 1365 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కేరళ, ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని, సామాజిక దూరం నిబంధనలు పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)