పులిని ఫోటో తీద్దామని వెళ్తే పంజాతో కొట్టింది !

Telugu Lo Computer
0


అస్సాంలోని దిబ్రుఘర్ లోని చబువా బైపాస్‌ కల్వర్టులో మగ చిరుతపులి ఉన్నట్లు అటుగా వస్తున్న బాటసారులు గుర్తించారు. ఈ వార్త స్థానిక గ్రామస్తులకు చేరడంతో వారంతా పులిని చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. దినసరి కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అటుగా వస్తున్నాడు. చిరుత పులి ఉందని తెలిసి స్పాట్‌కు చేరుకున్నాడు. అంతటితో ఆగకుండా చిరుతను సెల్ ఫోన్‌లో ఫొటోలు తీయడం ప్రారంభించాడు. ఫొటో సరిగా రాలేదని చిరుతను దగ్గరగా ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు. చిరుత ఒక్కసారిగా ఫొటో తీసే వ్యక్తిపై దాడికి దిగింది. అకస్మాత్తు దాడితో సదరు వ్యక్తి కాలుకు గాయమైంది. అదే సమయానికి అటవీ శాఖ అధికారులు అక్కడికి రావడంతో చిరుతను శాంతింపజేశారు. చిరుత పులి వెంబడించడంతో ప్రజలు భయంతో పరుగులు తీయడం వీడియోలో కనిపిస్తోంది. చివరికి టిన్సుకియా అటవీశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని చిరుతను బందించారు. ఈ సందర్భంగా వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెందిన పశువైద్యుడు ఖనిన్ చాంగ్‌మై మాట్లాడుతూ చిరుత పులి గురించి సమాచారం అందుకున్న తరువాత, టిన్సుకియా అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మేము చిరుత పులిని శాంతింపజేసి టిన్సుకియాకు తీసుకువెళ్లాము. ఆరోగ్య పరీక్షల తరువాత అడవిలోకి వదిలేస్తామని తెలిపాడు. ఈ సంఘటన గురించి అటవీ అధికారి మాట్లాడుతూ.. అస్సాంలో జనావాసాల్లోకి జంతువులు తరచుగా జరుగుతున్నాయని అన్నారు. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతో ఇలా జరుగుతుందని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)