ఈ రైలులో ప్రయాణం ఉచితం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 4 May 2022

ఈ రైలులో ప్రయాణం ఉచితం !


హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సరిహద్దుల్లో ఉన్న 13 కి.మీ. రైలు మార్గంలో ఈ రైలు నడుస్తుంది. దీనిని భక్రా నంగల్ రైలును భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు నిర్వహిస్తోంది.  ఇది సట్లెజ్ నది గుండా వెళుతుంది. కొండకోనలు, నదుల సోయగాల మధ్య రైలు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రైలులో వెళ్లే ప్రయాణికుల నుంచి ఎలాంటి చార్జీలను వసూలు చేయరు. అందుకే ప్రతి రోజూ ఎంతో మంది ప్రజలు ఈ రైలులో ప్రయాణిస్తారు. ముఖ్యంగా భాక్రా-నంగల్ ఆనకట్ట అందాలను చూసేందుకే ఎక్కువ మంది వస్తుంటారు. 70 ఏళ్లుగా ఈ రైలు మార్గం అందుబాటులో ఉంది. ఇంతకుముందు రైలులో 10 కోచ్‌లు ఉండగా.. ప్రస్తుతం మూడు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవన్నీ చెక్కతో చేసినవే ! అందుకే అన్నింటికంటే ఈ రైలు చాలా భిన్నంగా, అందంగా ఉంటుంది. భాక్రానంగల్ డ్యామ్ నిర్మాణ పనులు 1948లో మొదలయ్యాయి. కార్మికులు, భారీ యంత్రాలను తీసుకెళ్లేందుకు వీలుగా అప్పుడు రైలు మార్గాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1963లో భాక్రానంగల్ డ్యామ్‌ను ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా భాక్రా గ్రామంలో ఉంది. ఇది 741 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన డ్యామ్‌లో ఒకటిగా ఉంది. ఇది స్ట్రెయిట్ గ్రావిటీ డ్యామ్‌గా ప్రసిద్ధి చెందింది. మొదట డ్యామ్ నిర్మాణానికి అవసరమమ్యే కార్మికులు, సామాగ్రిని తరలించేందుకు రైలును నడిపారు. ఆ తర్వాత అదే మార్గంలో ప్రయాణికుల రైలును ఉచితంగా నడుపుతున్నారు. డ్యామ్‌కు చారిత్రక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ఈ రైలు మార్గం కమర్షియల్ చేయలేదు. ఎందుకంటే తర్వాతి తరం వారు ఈ వారసత్వ కట్టడాన్ని చూసేందుకు రావాలని బీబీఎంబీ కోరుకుంటోంది. అందుకే భాక్రా నంగల్‌ రైలును వారసత్వ సంపదగా భావించి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి బీబీఎంబీ స్వాగతం పలుకుతోంది. ఈ డ్యామ్‌ను చూసేందుకు ప్రతి రోజూ వందలాది మంది ప్రయాణికులు రైల్లో వస్తుంటారు. ఇందులో విద్యార్థులే ఎక్కువగా కనిపిస్తారు. బర్మాలా, ఒలిండా, నెహ్లా భక్రా, హండోలా, స్వామిపూర్, ఖేదా బాగ్, కలకుండ్, నంగల్, సలాంగ్డి, భాక్రా చుట్టుపక్కల గ్రామాలతో సహా అన్ని ప్రాంతాల ప్రజలు రైలులో ప్రయాణిస్తారు.

No comments:

Post a Comment