వివాహ ఆహ్వాన పత్రిక వైరల్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 4 May 2022

వివాహ ఆహ్వాన పత్రిక వైరల్


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన హరీశ్ బాబు పవన్ కల్యాణ్ సారధ్యం వహిస్తున్న జనసేన పార్టీపై వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. జనసేన లీగల్ సెల్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న హరీశ్ బాబు వివాహం ఈ నెల 4న జరగనుంది. ఈ సందర్భంగా హరీశ్ బాబు తన వివాహ శుభలేఖపై ఏ రాశాడో తెలుసా..? పవన్ అంటే తనకు చాలా అభిమానం అన్నారు. అందుకే జనసేన పార్టీ మేనిఫెస్టో, గుర్తు, పవన్ కల్యాణ్ ఫొటోలను శుభలేఖలో ముద్రించారు. శుభలేఖ కింది భాగంలో పెళ్లి ముహూర్తం వివరాలను కూడా ప్రింట్ చేయించాడు. పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన సిద్ధాంతాలు తనకు ప్రేరణ కలిగించాయని హరీశ్ బాబు చెప్పారు. జనసేన మేనిఫెస్టోతో ముద్రించిన ఈ శుభలేఖ పవన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.   పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రాణమని.. ఆయన సిద్ధాంతాలు తనకు ప్రేరణ కలిగించాయని కోటే హరీష్‌బాబు పేర్కొన్నాడు. అటు మేనిఫెస్టోతో ముద్రించిన ఈ శుభలేఖ జనసేన అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అయితే పవన్ అభిమానులు ఇలా చేయడం ఇదే తొలి సారి కాదు.. సాధారణంగా పెళ్లి శుభలేఖల మీద దేవుడి ఫొటోలు వేస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని తనకు పవన్ కళ్యాణ్ దేవుడు అంటూ తన పెళ్లి శుభలేఖ మీద జనసేనాని ఫొటోలు ముద్రించి సందర్భాలు రెండు మూడు ఉన్నాయి. గతంలో విశాఖ జిల్లాకు చెందిన రాజేష్ రెడ్డి అనే అభిమాని ఇలా జనసేన తరహాలో వెడ్డింగ్ కార్డును ముద్రించాడు. అక్టోబర్ 13న రాజేష్ రెడ్డికి హేమలతతో విశాఖపట్నంలో వివాహం జరిగింది. ఈ పెళ్లికి తమ బంధువులు, స్నేహితులను పిలిచేందుకు ఈ వెడ్డింగ్ కార్డులు అప్పట్లో ఇచ్చాడు. ఇప్పుడు అతడిని మించి అనేలా.. తూర్పుగోదావరి జిల్లాలో హరీశ్ బాబు.. ఈ శుభలేఖలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కేవలం పవన్ మాత్రమే కాదు.. గతంలో కూడా కొందరు అభిమానులు తమ తమ అభిమాన నేతలు, హీరోల మీద ప్రేమను చాటుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా తమ పెళ్లి శుభలేఖల్లో మోదీ, బాలయ్య ఫొటోలను ముద్రించారు.

No comments:

Post a Comment