ధరల పెరుగుదలకు నిరసనగా ఏనుగుపై ఊరేగిన సిద్ధూ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 19 May 2022

ధరల పెరుగుదలకు నిరసనగా ఏనుగుపై ఊరేగిన సిద్ధూ!


ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. పాటియాలాలో ఏనుగుపై వీధుల్లో ఊరేగుతూ జెండాను ప్రదర్శించిన సిద్ధూకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. పెట్రోల్‌, డీజిల్, వంట గ్యాస్ ధరలు చుక్కలనంటడంతో విపక్షాలు మోదీ సర్కార్‌పై విరుచుకుపడుతున్నాయి. అంతకుముందు ఈరోజు ఉదయం సిలిండర్ ధరలను కేంద్రం మరోసారి పెంచింది. ప్రభుత్వం ఈ నెలలో ఎల్‌పీజీ సిలిండర్ ధరను పెంచడం ఇది రెండవసారి కావడం గమనార్హం. తాజా పెంపుతో ఎల్‌పీజీ సిలిండర్ ధర పలు నగరాల్లో రూ వేయి దాటింది. తాజాగా సిలిండర్ ధర రూ 3.50 పెరిగింది. అదే సమయంలో వాణిజ్య సిలిండర్ ధర మరో 8 రూపాయలు బారమైంది. మరోవైపు పెట్రోల్‌, డీజిల్ ధరలు లీటర్‌కు 120 రూపాయలు దాటి వాహనదారులకు చుక్కలు చూపుతున్నాయి. వంట నూనెల ధరలూ భగ్గుమంటున్నాయని గృహిణులు వాపోతున్నారు. ఇక కూరగాయలు, పండ్ల ధరలూ పట్టపగ్గాల్లేకుండా పెరుగుతున్నాయి. ఇంధన ధరలు పెరగడంతో సరుకు రవాణా వ్యయం పెరిగి నిత్యావసరాల ధరలూ భారమయ్యాయి.


No comments:

Post a Comment