ఉద్యోగి రెండు మూలాల నుంచి పెన్షన్ పొందవచ్చు!

Telugu Lo Computer
0


ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లేదా పదవీ విరమణ చేసి పింఛన్ పొందుతూ మరణిస్తే.. ఆ ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం కుటుంబ పింఛను అందిస్తుంది. ఈ ఫ్యామిలీ పెన్షన్‌కు సంబంధించి ఒక సందేహం చాలామందిని వేధిస్తోంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్‌కు సంబంధించి రెండు విభిన్న మూలాల నుంచి పెన్షన్ తీసుకోవచ్చా లేదా అని కుటుంబ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే తాజాగా ఈ ప్రశ్నకు సమాధానంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్‌, పెన్షనర్స్‌ వెల్ఫేర్ ఒక వివరణ ఇచ్చింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 2021 ప్రకారం ఒకే ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్‌కు సంబంధించి కుటుంబ సభ్యుడు రెండు విభిన్న మూలాల నుంచి పెన్షన్ పొందడానికి అర్హులేనని పెన్షనర్ల సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. కుటుంబ పింఛను పొందుతున్న వారికి సమాధానంగా ప్రభుత్వం ఓ మెమోరాండం విడుదల చేసింది. "కుటుంబ పెన్షన్‌కు సంబంధించి ఒక సభ్యునికి ఉన్న అర్హతపై వివరణ కోరుతూ పలు ప్రశ్నలు వచ్చాయి. ఒకే ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్‌కు సంబంధించి రెండు వేర్వేరు మూలాల నుంచి కుటుంబ సభ్యులు పెన్షన్ పొందవచ్చా అనేది వారి ప్రశ్న. సైనిక సేవ, పౌర సేవకు సంబంధించి లేదా స్వయంప్రతిపత్త సంస్థ పౌర ప్రభుత్వ విభాగంలో అందించిన సేవకు సంబంధించి ఇలా భిన్నమైన మూలాల నుంచి పెన్షన్ పొందవచ్చా అని అడిగారు" అని మే 23 నాటి ఆఫీస్ మెమోరాండమ్‌లో పెన్షన్స్‌, పెన్షనర్స్ సంక్షేమ శాఖ పేర్కొంది. కుటుంబ పెన్షన్‌లకు సంబంధించిన నియమ, నిబంధనలు ఇంతకు ముందు భిన్నంగా ఉండేవి. కానీ తదనంతరం ఆ నియమాలను మార్చేశారు. ఇప్పుడు కేంద్ర సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 2021 ప్రకారం, ఒకే ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్‌కు సంబంధించి కుటుంబ పింఛనును రెండు వేర్వేరు మూలాల నుంచి కుటుంబ సభ్యులు తీసుకునే విషయంపై ఎలాంటి పరిమితి లేదు. డిసెంబరు 27, 2012న పూర్వపు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1972 సవరణకు ముందు, ఆ నిబంధనలలోని రూల్ 54లోని 13-A సబ్ రూల్ సివిల్ వైపు నుంచి వైదొలిగి తిరిగి ఉద్యోగంలో ఉన్న సైనిక పెన్షనర్‌కు కుటుంబ పెన్షన్ మంజూరు చేయడాన్ని నిషేధించింది. సైనిక పెన్షనర్ అందించిన సైనిక సేవ కోసం అతను కుటుంబ పెన్షన్‌ను ఎంచుకునే విషయంలో కేంద్రం పెన్షన్ మంజూరు నిషేధించింది. రూల్ 54లోని రూల్ 13-B సబ్-రూల్, ఇప్పటికే కుటుంబ పెన్షన్ పొందుతున్న వ్యక్తికి లేదా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం /లేదా ఏదైనా ఇతర నిబంధనల ప్రకారం అర్హులైన వ్యక్తికి రెండు కుటుంబ పెన్షన్‌లను మంజూరు చేయడాన్ని నిషేధించింది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ/స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ/స్థానిక నిధి ఇలా రకరకాల మార్గాల నుంచి పెన్షన్ పొందటాన్ని నిషేధించింది. డిసెంబరు 27, 2012 నాటి నోటిఫికేషన్ ప్రకారం, నోటిఫికేషన్ నెం. l/33/2012-P&PW (E) ద్వారా సబ్-రూల్స్ 13-A, 13-B తొలగింపు 24 సెప్టెంబర్, 2012 నుంచి అమలులోకి వచ్చింది. ఒకే ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్‌కు సంబంధించి రెండు వేర్వేరు మూలాల నుంచి కుటుంబ పెన్షన్ హక్కుపై ఉన్న పరిమితిని పైన పేర్కొన్న సవరణ నోటిఫికేషన్ ద్వారా తొలగించారు. కేంద్ర సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 2021 డిసెంబరు 20, 2021న గతంలో ఉన్న సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1972ని భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ రూల్ 50, 2021 కుటుంబ పెన్షన్ సంబంధించి ఉంది. ఈ నియమం ఒకే ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్‌కు సంబంధించి రెండు వేర్వేరు మూలాల నుండి కుటుంబ పెన్షన్ మంజూరుపై ఎలాంటి పరిమితిని విధించలేదు. "పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, ఒకే ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్‌కు సంబంధించి రెండు వేర్వేరు మూలాల నుండి కుటుంబ సభ్యునికి కుటుంబ పెన్షన్ మంజూరు చేయడంపై సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 2021లో ఎలాంటి ఆంక్ష లేదని స్పష్టం చేసింది." అని ఒక నోటిఫికేషన్ క్లారిటీ ఇచ్చింది. ఇద్దరు వేర్వేరు ప్రభుత్వ ఉద్యోగులు/పెన్షనర్లు మరణించిన తర్వాత కుటుంబంలోని ఒక సభ్యునికి రెండు కుటుంబ పెన్షన్‌లను పొందడం అనేది సెంట్రల్ సివిల్ సర్వీసెస్‌లోని సబ్-రూల్ 12(ఎ), సబ్-రూల్ 13లోని పరిమితికి లోబడి కొనసాగుతుందని కార్యాలయ మెమోరాండమ్‌లో పెన్షన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)