కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రధాన మంత్రి సహాయ నిధి

Telugu Lo Computer
0


కరోనాతో తల్లిదండ్రులు, ఇతర సంరక్షుకులను (గార్డియన్స్) కోల్పొయిన పిల్లలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపింది. అనాథలైన ఆయా పిల్లలకు ‘ప్రధాన మంత్రి సహాయ నిధి’  ద్వారా ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రధాని మోదీ సంకల్పించారు. ఈమేరకు మే 30 నుంచి ఈ సహాయాన్ని బాధితులకు అందించనున్నారు. పధకంలో భాగంగా, 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్య కాలంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను, సంరక్షుకులను, ఒంటరి తల్లి, తండ్రిని కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్స్ కింద సహాయం అందించనున్నారు. ఇందులో స్కాలర్ షిప్స్, భారత్ వైద్య బీమా కార్డులు, పీఎం కేర్స్ పాసు పుస్తకాలు అందించనున్నారు. బాధిత పిల్లలకు 18 ఏళ్ళు నిండే వరకు వారి పేరిట రూ.10 లక్షల సొమ్ము బ్యాంకులో ఉండేలా డిపాజిట్ చేస్తారు. 18 – 23 ఏళ్ల మధ్యలో ఆ డిపాజిట్ పై వచ్చిన వడ్డీని వారికి ఆర్ధిక సాయంగా ఇవ్వనున్నారు. ఇక 23 ఏళ్ళు నిండిన తరువాత ఆ రూ. పది లక్షలను పూర్తిగా బాధితులకు ఇవ్వనున్నారు. ఇప్పటికే దీనికి సంబందించిన ప్రక్రియ పూర్తి కాగా..సోమవారం ప్రధాని మోదీ ఈ ఆర్ధికసహాయా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బాధిత పిల్లలు తమ వివరాలు నమోదు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ పధకం కింద ఎంత మందికి లబ్ది చేకూరుతుందనే విషయాలు మాత్రం తెలియారాలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)