12 ఏళ్లు దాటిన వారికి కొవావాక్స్ !

Telugu Lo Computer
0


12ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ కొవావ్యాక్స్ అందుబాటులో ఉంటుందని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా వెల్లడించారు. “కొవావ్యాక్స్ పెద్దవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందా అంటే అవును 12ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కొవావ్యాక్స్ ఇండియాలోని చిన్నారులకు అందుబాటులో ఉంటుందని తెలిపిన మరుసటిరోజే ఈ ప్రకటన చేయడం గమనార్హం. పిల్లల కోసం ఇండియా తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఇదొక్కటే. యూరప్ దేశాల్లో కూడా దీనిని అమ్ముతున్నారు. 90శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. “పిల్లలను రక్షించడానికి మరో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని” ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. గత వారం నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్  సీరం సంస్థ తయారుచేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ 12-17ఏళ్ల మధ్య వయస్కులు వాడొచ్చని అప్రూవల్ ఇచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)