పరీక్షలు రాయకుండానే వెనుదిరిగిన విద్యార్థులు !

Telugu Lo Computer
0


కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పీయూసీ రెండో సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. హిజాబ్‌ ధరించి పరీక్షకు హాజరైన ఇద్దరు విద్యార్థినులను కాలేజీ యాజమాన్యం పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. ఆ విద్యార్థినులు దాదాపు 45 నిమిషాల పాటు ఇన్విజిలేటర్‌, కళాశాల ప్రిన్సిపల్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ .. హిజాబ్‌ ధరించి పరీక్షలకు హాజరవ్వకూడదని కోర్డు ఆదేశాలు ఉన్నందున.. ఆ విద్యార్థినులను అనుమతించలేమని స్పష్టం చేశారు. దీంతో పరీక్ష రాయకుండానే వారు వెనుదిరిగారు. కాగా, తనను హిజాబ్‌ ధరించి పరీక్ష రాయడానికి అనుమతించాలని ఓ విద్యార్థి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నగేశ్‌ను అభ్యర్థించగా.. అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరిలో ఉడుపి కళాశాలలో మొదలైన హిజాబ్‌ వివాదం సమీపంలోని మరికొన్ని కళాశాలలకు వ్యాపించింది. ఈ విషయంలో విద్యార్థినులు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. విద్యాసంస్థల్లో ఏకరీతి దుస్తుల నియమాన్ని పాటించాలని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)