ఎక్స్‌ట్రా క్లాస్ పేరుతో విద్యార్ధినిపై లైంగిక దాడి

Telugu Lo Computer
0



ప్రియేష్ సింగ్ అనే కోల్‌కతాలోని యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుడు సెంగార్ ఇనిస్టిట్యూట్ లో జాగ్రఫీ బోధించేవాడు. గత డిసెంబర్ లో ఎక్స్‌ట్రా క్లాస్ తీసుకునే నెపంతే  హౌరాకు చెందిన విద్యార్ధినిని సాల్ట్ లేక్ గెస్ట్ హౌస్‌కు పిలిపించాడు. అక్కడ ఆమెను మాయమాటలతో లోబరుచుకుని ఆమెపై లైంగికదాడి చేశాడు. అదంతా సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. అనంతరం ఆవిద్యార్ధిని ఇంటికివెళ్లిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి తనను కలవడానికి గ్వాలియర్ రావాలని కోరగా అందుకు విద్యార్ధిని తిరస్కరించింది. దీంతో అతడు ఆమెను బెదిరించటం మొదలెట్టాడు. సాల్ట్ లేక్ గెస్ట్ హౌస్‌లో తీసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. లేదా రూ. 5 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆ విద్యార్ధిని ఫిబ్రవరి 15న కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని యూపీఎస్సీ ఉపాధ్యాయుడి కోసం గాలించిన పోలీసులు ఇటీవల మధ్య ప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం కొల్‌కతా తీసుకువచ్చిసాల్ట్ లేక్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)