కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే?

Telugu Lo Computer
0


భారత కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా మనోజ్ పాండే పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. మార్చి నెలాఖరులో పదవీ విరమణ చేస్తున్న ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే స్థానంలో పాండే పగ్గాలు చేపడతారు. ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ స్థానంలో ఆ పదవిని జనరల్ నరవణే చేపట్టే అవకాశాలున్నాయి. గత ఏడాది డిసెంబర్ 8న విమానం కుప్పకూలిన ఘటనలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 12 మంది సాయుధ సిబ్బంది మృతి చెందిన ఘటన యావద్దేశాన్ని కుదిపేసింది. గత మూడు నెలల్లో పదవీ విరమణ చేసిన కొంతమంది ఉన్నతాధికారుల తరువాత సీనియర్‌గా లెఫ్టినెంట్ జనరల్ పాండే ఉన్నారు. ప్రస్తుత లెఫ్టినెంట్ జనరల్ రాజ్‌శుక్లా (ఏఆర్‌టీఆర్ఏసీ) ఈనెల 31న రిటైరవుతున్నారు. గత జనవరి 31న సీనియర్ మోస్ట్ అధికారులైన లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతీ, లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషిలు పదవీ విరణణ చేశారు. ఈ మార్చి నెలాఖరులోనే కీలక పదవుల్లో మార్పులు చోటుచేసుకోనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా స్థానంలో ఏఆర్‌టీఆర్ఏసీ కమాండ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎస్ మహల్ సిమ్లాలో బాధ్యతలు చేపడతారు. ఆర్మీ అడ్జుటంట్ జనరల్‌గా లెఫ్టినెంట్ జనరల్ సి.బన్సీ బాధ్యతలు తీసుకుంటారు. ఉత్తర భారత్ ఏరియాకు జనరల్ ఆఫీసర్‌ కమాండింగ్‌గా లెఫ్టినెంట్ జనరల్ జేపీ మాథ్యూస్ బాధ్యతలు చేపడతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)