నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీనామా - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 22 April 2022

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీనామా


నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ రాజీనామా చేశారు. తనకు అప్పజెప్పిన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో రాజీవ్ స్థానంలో సుమన్ కే బెరీని నూతన వైస్ చైర్మన్ గా శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నియమించింది. వచ్చే నెల 1వ తేదీన సుమన్ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా పని చేస్తున్న రాజీవ్ కుమార్ పదవీ కాలం ఏప్రిల్ 30తో ముగియనుంది. కానీ ఆయన ముందే తప్పుకున్నారు. 2017 ఆగస్టులో అప్పటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా ఉన్న అరవింద్ పనగరియా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. రాజీవ్ కుమార్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 30న ఆయన బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలుగుతారని తెలిపింది. వ్యవసాయ రంగం, పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాల్లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా రాజీవ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. లక్నో యూనివర్సిటీలో పీహెచ్ డి  చేసిన రాజీవ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో డీఫిల్ పూర్తి చేశారు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సీనియర్ ఫెలోగా ఉన్నారు. కొత్తగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా నియమితులైన సుమర్ బేరీ.. ఇంతకుముందు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ గా పని చేశారు.

No comments:

Post a Comment