సీఎస్‌ను కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు

Telugu Lo Computer
0


తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సచివాలయానికి వచ్చారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎస్ సమీర్ శర్మను కలిసి సుప్రీంకోర్టు ఆదేశాలను అందజేశారు. పోలీసు డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు యూనిఫాం ధరించి సచివాలయంలో సీఎస్‌ను కలిశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల రీత్యా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేసేందుకు సచివాలయానికి వచ్చినట్లు ఏబీవీ స్పష్టం చేశారు. పోస్టింగ్‌తో పాటు పెండింగ్ జీత భత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పోస్టింగ్ అంశాన్ని ప్రాసెస్‌లో పెడతామని సీఎస్ హామీ ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలసిందే. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ)ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ కొనసాగించడం కుదరదని పేర్కొంది. ఏబీవీని మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేసేందుకు ఏబీవీ సచివాలయానికి వచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)