ముంబై లోకల్ ఏసీ రైళ్లలో 50శాతం టిక్కెట్ ధర తగ్గింపు

Telugu Lo Computer
0


దేశ వ్యాప్తంగా పెట్రో ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. ఏది ముట్టినా.. రేట్లు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో రైల్వే బోర్డు ఓ నిర్ణయం తీసుకుంది. ముంబై లోకల్ ఏసీ రైళ్లలో ధరలను తగ్గిస్తూ చల్లని కబురు చెప్పింది. ఇప్పుడు ముంబై లోకల్ ఏసీ రైళ్లలో సగం ధరకే జర్నీ చేయవచ్చు. 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. ముంబైలో లోకల్ రైళ్లు ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తాయి. ముంబైలో జనం దాదాపు ఈ లోకల్ రైళ్ల ద్వారానే రాకపోకలను సాగిస్తుంటారు. ఇక.. ముంబైలో ఎండవేడి కూడా విపరీతంగా ఉంది. దీంతో ఒక్కసారిగా స్థానికంగా ఉండే ఏసీ లోకల్ రైళ్లకు డిమాండ్ పెరిగింది. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏసీ రైళ్లలో టిక్కెట్ ధర 50 శాతం తగ్గించడాన్ని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతించారు. కొన్ని రోజులుగా ఈ డిమాండ్ ఉందని, ఇప్పుడు తగ్గించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)