సినిమా ఘన విజయంతో కేజీఎఫ్‌ పట్టణానికి సందర్శకుల జోరు !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని కోలారు జిల్లాలోని కేజీఎఫ్‌ పట్టణానికి కేజీఎఫ్‌1, కేజీఎఫ్‌2 సినిమాలు ఘన విజయం సాధించడంతో సందర్శకులు పోటెత్తుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ఆ పట్టణాన్ని సందర్శిస్తున్నారు. జిల్లావాసులే కాకుండా ఇరుగు పొరుగు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు నుంచి పర్యాటకులు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గతంలో అనేక సినిమాల చిత్రీకరణలకు ఈ పట్టణం వేదికగా మారినా కేజీఎఫ్‌ సినిమా తరువాతనే ఇంతటి ప్రాచుర్యం లభించినట్లు స్థానికులు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత లోతైన బంగారం గని కేజీఎఫ్‌ సొంతమని తెలిపారు. మూడు వేల అడుగులకు పైగా లోతున్న గనుల ద్వారా వెలికి తీసిన బంగారం ముడి ఖనిజాన్ని శుభ్రం చేసిన తరువాత ఆ మట్టిని (సైనైడ్‌) దిబ్బలుగా పోశారు. పట్టణ శివార్లలో కొండలుగా ఉన్న ఈ ప్రాంతం.. చిత్రీకరణకు అత్యంత అనువైనదిగా గుర్తింపు పొందింది. కన్నడతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషలకు చెందిన వేలాది సినిమాల చిత్రీకరణను ఈ కొండలపై చిత్రీకరించారు. నిత్యం ఏదో ఒక భాషకు చెందిన చిత్రీకరణ కొనసాగుతుంటుంది. గతంలో ముంగారుమళె సినిమా ఘన విజయం సాధించిన సందర్భంలో ఆ సినిమాను చిత్రీకరించిన జోగ్‌ ప్రాంతాన్ని చూసేందుకు ప్రజలు పోటెత్తారట. అదే తరహాలో ఇప్పుడు కేజీఎఫ్‌ పట్టణాన్ని సందర్శిస్తున్నారు. రాకీభాయ్‌ సంచరించిన ప్రాంతంలో సెల్ఫీ తీసుకుంటూ సంబరపడుతున్నారు. సందర్శకుల సంఖ్య అధికంగా ఉండడంతో స్థానికులకు కూడా వివిధ రూపాల్లో ఉపాధి లభిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)