పుట్టగొడుగులు తిని 13 మంది మృతి

Telugu Lo Computer
0


అస్సాంలోని చరైడియో, దిబ్రూగర్, శివసాగర్ మరియు టిన్సుకియా జిల్లాలకు చెందిన టీ గార్డెన్ కార్మికులు టీ తోటల్లో పని ముగించుకుని వస్తుండగా దారిలో కనిపించిన పుట్టగొడుగులను ఇంటికి తెచ్చుకున్నారు. వాటిని కూర వండి తిన్నారు. ఆహారం తిన్న కాసేపటికే వీరంతా కడుపు నొప్పితో వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి మరింతగా క్షీణించటంతో దిబ్రూఘర్‌లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతు 13మంది చనిపోయారు. మిగిలివారిని కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రశాంత డిహింగియాతెలిపారు. కాగా..పుట్టగొడుగులను తిన్న తర్వాత అస్వస్థతకు గురై గత ఐదు రోజుల్లో AMCHలో చేరారు. చేరిన 35 మందిలో గత 24 గంటల్లో 13 మంది చనిపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)