జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాలు

Telugu Lo Computer
0


జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల సీజన్ ఉంటుందని  వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల వర్షాలు ఈ ఏడాది సాధారణ స్థాయిలోనే ఉంటుందని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల కాలానుగుణ వర్షపాతం దీర్ఘకాల సగటులో ఈ ఏడాది 96 నుండి 104 శాతం మేర వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. జూన్ నెలలో నైరుతి రుతుపవనాల ప్రారంభం తర్వాత ఉత్తర, మధ్య భారత్‌లోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని, అలాగే ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ద్వీపకల్పంలోని దక్షిణ ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాగా, గతేడాది కూడా నైరుతి రుతుపవనాలు జూన్‌ నుంచి సెప్టెంబర్ వరకు ఉండగా, అప్పుడు కూడా సాధారణ వర్షపాతమే నమోదైంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)