ప్రధాని సభావేదికకు 12 కి.మీ దూరంలో పేలుడు

Telugu Lo Computer
0


జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా జమ్మూకాశ్మీర్ లోని మారు మూల గ్రామం నుంచి మోదీ యావత్ జాతికి సందేశం వినిపించనున్నారు. ఈ పర్యటనలో ఆయన బనిహాల్‌-కాజీగుండ్ సొరంగ మార్గంతో పాటు, రూ.20వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే ప్రధాని పర్యటనకు కొన్ని గంటల ముందు సభావేదికకు 12 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. లాలియాన గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 4.30గంటల సమయంలో ఓ పొలంలో పేలుడు చోటు చేసుకుంది. ప్రధాని బహిరంగ సభ జరగనున్న సాంబా జిల్లాలోని పల్లీ గ్రామానికి ఇది సమీపంలోనే ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఇది ఉగ్రదాడి కాకపోవచ్చునని పోలీసులు బావిస్తున్నారు. బహుశా ఇది పిడుగుపాటు లేదా ఉల్క వల్ల ఏర్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)