దేశంలో కొత్తగా కరోనా 1150 కేసులు !

Telugu Lo Computer
0


దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం ముంబాయిలో కొవిడ్ వేరియంట్ ఎక్స్ఈ ఆనవాళ్లు గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, అప్రమత్రంగా ఉండాలని ఆయా రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అయితే శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన కొవిడ్ వివరాలను చూస్తే దేశంలో కొవిడ్ కట్టడిలోనే ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా 4.6లక్షల మందికి కొవిడ్ టెస్ట్ లు నిర్వహించగా 1,150 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 11, 365 తగ్గింది. మరోవైపు తాజాగా కొవిడ్ తో దేశవ్యాప్తంగా 83 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్ తో మృతి చెందిన వారి సంఖ్య 5,21,656 కు చేరింది. రెండేళ్ల కాలంలో 4.30 కోట్ల మందికి కరోనా సోకగా అందులో 98.76 శాతం మంది వైరస్ నుంచి కోలుకున్నారు. చికిత్స పొందుతున్న వారి సంఖ్య 0.03 శాతానికి తగ్గిపోయింది. మరణాలు రేటు 1.21 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా 14.7 లక్షల మంది టీకా తీసుకోగా.. నిన్నటి వరకు 185కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)