గుజరాత్‌లో 'ఎక్స్ ఈ' కలకలం !

Telugu Lo Computer
0


దేశంలో కొత్త వేరియంట్‌ 'ఎక్స్‌ఈ' కలకలం సృష్టిస్తోంది. తాజాగా గుజరాత్‌లోనూ తొలి ఒమిక్రాన్‌ 'ఎక్స్ ఈ' కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ముంబయిలో ఈ రకం కేసు బయటపడినట్లు వార్తలు వచ్చిన విషయం విధితమే.  ఎక్స్ ఈ వేరియంట్ సోకినట్లుగా భావిస్తోన్న వ్యక్తి నమూనాలను నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ)కు పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది మాత్రం పేర్కొనలేదు. మార్చి 13న సదరు వ్యక్తి కొవిడ్‌ బారిన పడగా, వారానికి కోలుకున్నట్లు తెలుస్తోంది. అయితే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో ఎక్స్ ఈ వేరియంట్‌ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవడంతో తదుపరి విశ్లేషణ నిమిత్తం ఎన్‌సీడీసీకి పంపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు ముంబయిలో ఓ మహిళకు ఎక్స్ ఈ వేరియంట్‌ సోకినట్లు వచ్చిన వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. మహిళ నమూనాల్లో ఉన్న మ్యుటెంట్‌ జెనెటిక్‌ మేకప్‌ ఎక్స్ ఈ మ్యుటెంట్‌తో సరిపోలడం లేదని ఇన్సాకాగ్‌ పరిశోధనలో తెలిసిందని కేంద్రం వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)