కాశ్మీర్‌ ఎన్ కౌంటర్ లో నిసార్ దార్ హతం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 8 April 2022

కాశ్మీర్‌ ఎన్ కౌంటర్ లో నిసార్ దార్ హతం


దక్షిణ కాశ్మీర్ లోని అనంత్ నాగ జిల్లాలోని సిర్హామా ప్రాంతంలో శనివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో లష్కరే తోయిబా కమాండర్ నిసార్ దార్ హతమయ్యాడు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భారత బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఓ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి వుండడాన్నిగమనించారు. భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కాశ్మీర్ పోలీసులు ధృవీకరించారు. ముందు జాగ్రత్తల మేరకు కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ ను నిలిపివేశారు. బుధవారం పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

No comments:

Post a Comment