టికెట్ ధరలు పెంచిన టీఎస్‌ఆర్టీసీ

Telugu Lo Computer
0


తెలంగాణలో ఆర్టీసీ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులపై రూ.1 పెంచారు. టోల్‌ప్లాజా ధర టికెట్‌పై రూపాయి పెంచారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులపై రూ.2 మేర పెంచింది టీఎస్ఆర్టీసీ. పల్లె వెలుగు టికెట్ల ఛార్జీలను ఆర్టీసీ రౌండప్ చేసింది. చిల్లర సమస్య లేకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ ఆర్టీసీ పేర్కొంది. పెరిగిన టికెట్ ఛార్జీలను వసూలు చేస్తున్న కండక్టర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ ప్రకటన లేకుండా ఎక్కువ ఛార్జీలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రయాణికుల ప్రశ్నలకు కండక్టర్లకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్య లేకుండా చూసేందుకుగానూ ఛార్జీలను టీఎస్ ఆర్టీసీ సవరించింది. రూ.13 ఉన్న టికెట్ ధరను రూ.15 చేసింది. అలాగే రూ.17 ఉన్న టికెట్ ఛార్జీలను రూ.15కు రౌండర్ ఫిగర్ చేసినట్లు సమాచారం. పెరుగుతున్న డీజిల్ ధరల నేపథ్యంలో కొన్ని నెలల కిందట టీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీలను అమాంతం పెంచేసింది. తాజాగా టోల్ ప్లాజా రూ.1, లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులపై రూ.1 పెంచారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)