మద్రాస్‌ ఐఐటీ క్యాంపస్‌లో ఆంత్రాక్స్‌తో జింక మృతి

Telugu Lo Computer
0


మద్రాస్ ఐఐటీ క్యాంపస్‌లో ఆంత్రాక్స్‌తో ఒక జింక మరణించింది. గుంపులో ఉన్న మరో మూడు జింకలు కూడా ఈ ప్రమాదకర వైరస్ భారిన పడినట్లు పశు వైద్యులు ధ్రువీకరించారు. ఆంత్రాక్స్ సోకిన నాలుగు జంతువులలో ఇటీవల ముక్కు నోటి ద్వారా రక్తం, నురగలు బయటకు వచ్చాయి. క్యాంపస్ లో జింక కళేబరాన్ని గుర్తించిన ఐఐటీ-మద్రాస్‌ భద్రతా సిబ్బంది గిండీ నేషనల్‌ పార్క్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న జాతీయ జంతు సంరక్షణ అధికారులు.. జింక కళేబరం ఉన్న ప్రాంతంలో ఆంక్షలు విధించారు. క్యాంపస్ లోని విద్యార్థులు, ఇతర సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. జింకలను పరిశీలించేందుకు వెళ్లిన పశువైద్యాధికారి ఆంత్రాక్స్‌తో జింక మృతి చెందినట్లు అనుమానించి నమూనాలు సేకరించారు. జింకల నమూనాలను పరీక్షల నిమిత్తం తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీకి పంపించారు. మృతి చెందిన జింక కళేబరంలో నమూనాలు ఆంత్రాక్స్ ఉన్నట్లు నిర్ధారించగా మిగిలిన వాటి నుండి సేకరించిన నమూనాలపై పరీక్షలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన జింక కళేబరాన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం ఖననం చేసినట్లు ఐఐటీ-మద్రాస్ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)