ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖలో కలకలం రేపుతోన్న ఆదేశాలు

Telugu Lo Computer
0


తాజాగా ఆంధ్రప్రదేశ్ లో  వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి సమీక్షను కమిషనర్ కంఠమనేని భాస్కర్‌ నిర్వహించారు. వైద్యులు అందుబాటులో ఉండడంలేదని, వైద్యం సరిగా అందడంలేదని చాలా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో భాస్కర్ కొన్ని ఆదేశాలిచ్చారు. ప్రతీఒక్కరు బయోమెట్రిక్ వాడాలని, దాంతోపాటు గంట గంటకూ సెల్ఫీ అప్‌లోడ్ చెయ్యాలని ఆ సెల్ఫీ కూడా ఎక్కడో తీసిందికాకుండా ఆస్పత్రి ప్రాంగణం, అది తమ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నట్లుగా చూపించేదిగా ఉండాలని ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలతో ఒక్కసారిగా వైద్యుల్లో కలకలం మొదలైంది. కొందరు అనుమానిస్తున్నారా, అవమానిస్తున్నారా అంటూ ప్రతిఘటిస్తుంటే మహిళా డాక్టర్లు మాత్రం ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు ఫోటోలు అప్‌లోడ్ చేస్తే సెక్యూరిటీ ఎలా ఉంటుందంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండడంలేదని, వైద్యం అందండలేదని వస్తున్న ఫిర్యాదులకు విరుగుడుగా భాస్కర్, సెల్ఫీల అప్‌లోడ్‌ నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి ఇది వైద్యులకు ఎందుకు మింగుడుపడడంలేదన్నది ప్రజల నుంచి వినిపిస్తున్న వెర్షన్. మరి ఈ ఇష్యూ మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో  చూడాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)