కాంగ్రెస్‌ను పక్కన పెట్టి ముందుకు రండి : మమతా

Telugu Lo Computer
0


రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష పార్టీల్లో కలవరం మొదలైంది. బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేయడంతో ఒక్కసారిగా పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకొనేందుకు ప్రక్షాళన చేపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. మరోసారి కాంగ్రెస్ ను టీఎంసీ టార్గెట్ చేసింది. జాతీయంగా బీజేపీని దెబ్బతీయడంలో విఫలమైందని పేర్కొంది. కాంగ్రెస్ ను టీఎంసీలో విలీనం చేయాలని, బీజేపీని ఓడించగలిగే ఏకైక వ్యక్తి మమతా బెనర్జీ అంటూ పేర్కొంది. ఆమె నాయకత్వంలో చేతులు కలపాలని సూచించింది. ఈ సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కొత్త స్లోగన్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా కాంగ్రెస్ ను పట్టుకుని వేలాడడం అర్థం లేదని, ఆ పార్టీని పక్కకు పెట్టి ముందుకు రావాలంటూ పార్టీలకు పిలుపునిచ్చారు. నిన్నటి వరకు కాంగ్రెస్ ను కలుపుకుని పోవాలని బీజేపీయేతర పార్టీలు అనుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవంతో ఆ పార్టీకి దూరంగా జరుగుతున్నాయి. బీజేపీ పార్టీపై పోరాడటానికి కాంగ్రెస్ శక్తి చాలదని తాము చాలాకాలంగా చెబుతున్నామని, ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలంటే మమతా బెనర్జీ నాయకురాలు కావాలని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ వెల్లడించారు. పాత పార్టీ అయిన కాంగ్రెస్ ఎందుకు కనుమరుగు అవుతుందో తెలియడం లేదని, టీఎంసీలో కాంగ్రెస్ ను విలీనం చేయడానికి ఇదే సరైన సమయమని టీఎంసీ నేత, రాష్ట్ర రవాణా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హకీమ్ తెలిపారు. జాతీయంగా మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాలపై .. గాడ్సే సూత్రాలకు వ్యతిరేకంగా పోరాడవచ్చన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)