No title

Telugu Lo Computer
0


దేశంలో కరోనావైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత కొద్ది కాలంగా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతున్నాయి. సోమవారం 5.7 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,259 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 35 మంది మృతి చెందారు. క్రియాశీల కేసులు 15,378కి తగ్గి, ఊరటనిస్తున్నాయి. దాంతో మొత్తం కేసుల్లో వాటి వాటా 0.04 శాతానికి చేరింది. నిన్న 1,700 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దాంతో రికవరీ రేటు 98.75 శాతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 4.30 కోట్ల మందికి కరోనా సోకగా 5.21 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని  మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)