మన ఊరు - మన బడి పథకం కింద డిజిటల్ క్లాసులు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 10 March 2022

మన ఊరు - మన బడి పథకం కింద డిజిటల్ క్లాసులు


మన ఊరు – మన బడి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గ్రామాల్లో మన ఊరు – మన బడి, పట్టణాల్లో మన బస్తీ – మన బడి పేరిట ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మన ఊరు – మన బడి పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమం కింద 12 అంశాలను చేపట్టడం జరిగింది. నీటి సరఫరా, టాయిలెట్లు, విద్యుత్ సమస్యలు, తాగునీటి సమస్యలు, ఫర్నీచర్, పెయింటింగ్, గ్రీన్ చార్ట్ బోర్డులు, కంపౌండ్ వాల్స్, డైనింగ్ హాల్స్, డిజిటల్ క్లాసులతో పాటు తదితర అంశాలను ప్రతిపాదించామన్నారు. మన ఊరు – మన బడి పథకాన్ని మూడు దశల్లో చేపడుతామన్నారు. రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెడుతున్నామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.


No comments:

Post a Comment