సాయం అందిస్తామని ముందుకొస్తున్న ఎందరో...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 23 March 2022

సాయం అందిస్తామని ముందుకొస్తున్న ఎందరో...!


ప్రముఖ డైరెక్టర్​ వినోద్​ కాప్డీ షేర్​ చేసిన వీడియోపై పలువురు స్పందిస్తున్నారు. ప్రదీప్​ మెహ్రాకు తోడ్పాటు అందించడానికి సిద్ధమంటున్నారు. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​ నొయిడా కలెక్టర్​ కూడా ముందుకొచ్చారు. ప్రదీప్​ తల్లికి వైద్యం తగిన ఆర్థిక సాయం సహా ఆర్మీలో చేరేందుకు శిక్షణ ఇప్పిస్తానని కలెక్టర్​ హామీ ఇచ్చినట్లు మెహ్రా మీడియాకు తెలిపారు. ''నేను ఈరోజు నొయిడా జిల్లా కలెక్టర్​ను కలిశా. మా అమ్మకు చికిత్స సహా ఆర్థిక సాయం, ఆర్మీలో చేరేందుకు శిక్షణ ఇప్పిస్తానని నాకు ఆయన చెప్పారు. ప్రస్తుతానికి మెక్​డొనాల్డ్స్​లో నా పని కొనసాగిస్తా. ఇప్పుడు శిక్షణ కోసం నాకు ఎక్కువ సమయం దొరుకుతుంది. అందరూ సాయం చేస్తామని ముందుకు వస్తుండటం నాకు సంతోషంగా ఉంది.'' అని ప్రదీప్​ అన్నాడు.  ప్రదీప్​ కెరీర్​ను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అన్నివిధాలా సహకరిస్తానని అంటున్నారు నొయిడా కలెక్టర్​ సుహాస్​. ఏం కావాలో ఎంచుకోవాలని అతడిని అడిగినట్లు చెప్పారు. ప్రదీప్​ మెహ్రా ఎందరికో ప్రేరణ కలిగిస్తున్నాడని, తాను కూడా అతడికి పెద్ద అభిమానిగా మారినట్లు చెప్పారు. 'ప్రదీప్​ తల్లికి చికిత్స కోసం మేం ఇప్పటికే నొయిడా మెడికల్​ కాలేజీతో మాట్లాడాం. కానీ.. ఎక్కడ చికిత్స అందించాలనేది ప్రదీప్​ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఏం కావాలో, ఏం చేయాలనుకుంటున్నాడో అన్నీ అడిగా' అని కలెక్టర్​ సుహాస్​ పేర్కొన్నారు. ​

No comments:

Post a Comment