బ్యాంక్ అకౌంట్ ఎక్కువగా ఉన్నాయి? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 21 March 2022

బ్యాంక్ అకౌంట్ ఎక్కువగా ఉన్నాయి?


ఎక్కువ బ్యాంకులలో ఖాతాలుంటే  బ్యాంకుకు దాని సొంత ప్రత్యేక నిర్వహణ ఛార్జీ, డెబిట్ కార్డ్ ఛార్జీ, ఎస్ఎంఎస్ ఛార్జ్, సర్వీస్ ఛార్జ్, మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జ్ ఉంటాయి. అంటే మీకు ఎన్ని బ్యాంకులలో ఖాతాలున్నాయో వాటన్నిటి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే బ్యాంకులు భారీ ఛార్జీలను వసూలు చేస్తాయి.  ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకార మీకు ఒకే బ్యాంకు ఖాతా ఉంటే రిటర్న్‌లను దాఖలు చేయడం సులభం. ఎందుకంటే మీ సంపాదనకు సంబంధించిన పూర్తి సమాచారం ఒకే ఖాతాలో అందుబాటులో ఉంటుంది. వేర్వేరు బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండటం వల్ల ఈ గణన కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో పన్ను శాఖ మీకు నోటీసు జారీ చేయవచ్చు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బడ్జెట్‌లో కొత్త విధానాన్ని ప్రకటించారు. ఒక సంవత్సరం పాటు సేవింగ్స్ ఖాతా లేదా కరెంట్ ఖాతాలో ఎలాంటి లావాదేవీ జరగకపోతే అది ఇన్‌యాక్టివ్ బ్యాంక్ ఖాతాగా మారుతుంది. రెండేళ్లపాటు లావాదేవీలు జరగకపోతే అది డోర్మాంట్ ఖాతా లేదా ఇన్‌ ఆపరేటివ్‌గా మార్చుతారు. అటువంటి బ్యాంకు ఖాతాతో మోసం అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో ఆ ఖాతా వివరాలు ప్రత్యేక లెడ్జర్లో చేర్చుతారు. ప్రైవేట్ బ్యాంకుల మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీ చాలా ఎక్కువ. ఉదాహరణకు హెచ్ డి ఎఫ్ సి  బ్యాంక్ కనీస నిల్వ 10 వేల రూపాయలు. గ్రామీణ ప్రాంతాలకు 5000 రూపాయలు. ఈ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు త్రైమాసికానికి జరిమానా రూ.750. ఇతర ప్రైవేట్ బ్యాంకులకు కూడా ఇలాంటి ఛార్జీలు వర్తిస్తాయి. పొరపాటున మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే అనవసరంగా ప్రతినెలా వందల రూపాయలు చెల్లించాల్సి రావచ్చు. ఇది సిబిల్ స్కోర్‌ని కూడా ప్రభావితం చేస్తుంది.


No comments:

Post a Comment