హైవేలపై కొత్తగా 1,576 ఛార్జింగ్‌ పాయింట్లు !

Telugu Lo Computer
0


దేశంలో ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల విస్తరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఫేమ్‌ ఇండియా స్కీమ్‌ ఫేజ్‌-2 కింద 25 రాష్ట్రాలు, యూటీల్లోని 68 నగరాల్లో 2,877 ఛార్జింగ్ స్టేషన్‌లను మంజూరు చేసినట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా 19 హైవేలు, 9 ఎక్స్‌ప్రెస్‌ వేల్లో 1,576 ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను మంజూరు చేసినట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా ఈవీ చార్జింగ్‌ పాయింట్ల ఏర్పాట్లకు సంబంధిత విద్యుత్‌ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. హైవేకు ఇరువైపులా ప్రతి 25 కిలోమీటర్లకు కనీసం ఒక చార్జింగ్‌ స్టేషన్‌ ఉండాలని, అదనంగా హైవేకు ఇరువైపులా ప్రతి వంద కిలోమీటర్ల వద్ద లాంగ్‌రేంజ్‌ లేదంటే హెవీ డ్యూటీ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ ఉండాలన్నది. దేశంలో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఫేమ్‌ ఇండియా) స్కీమ్‌లో భాగంగా ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫేజ్‌-1 కింద భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 520 ఛార్జింగ్‌ స్టేషన్లు మంజూరు చేసింది. ఫేజ్‌-2 స్కీమ్‌ కింద ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం ఐదేళ్ల [2019-20 నుంచి 2023-24] కాలానికి బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించనున్నది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లలో.. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై 16 స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)